Dharmapuri Arvind fires BRS : తడిసిన ధాన్యం కొనుగోలులో.. రాష్ట్ర ప్రభుత్వం విఫలం - జగిత్యాల జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
MP Dharmapuri Arvind visited Lakshmipur of Jagityala district : జగిత్యాల గ్రామీణ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ పర్యటించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ప్రారంభించారు. లక్ష్మీపూర్ గ్రామం అన్ని రంగాలలో ఆదర్శంగా నిలవడంపై ఆయన అభినందించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తడిసిన ధాన్యంతో రాష్ట్ర రైతాంగమంతా రోడ్డెక్కినా పట్టించుకోవడంలేదన్నారు. రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యంలో రంగు మారిందన్న వంకతో.. పెద్ద మొత్తంలో తరుగు తీసేస్తున్నారని మండిపడ్డారు. రంగుమారిన, మొలకలొచ్చినా ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు విక్రయించాలని సూచించారు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ సంస్థల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణమే రాష్ట్రప్రభుత్వం ఎఫ్సీఐ అధికారులతో మాట్లాడి.. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇథనాల్ తయారీ సంస్థలకు విక్రయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో పర్యటించి.. పంటనష్ట పోయినా రైతులకు ఎకరాకి పదివేలు ఇస్తామని మార్చి నెలలో ప్రకటించి ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. అన్నదాతలు ధాన్యం అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్ రైతుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.