Motkupalli Comments on Revanth Reddy : 'రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాబోతుంది.. రేవంత్​ రెడ్డే సీఎం'

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 3:32 PM IST

thumbnail

Motkupalli Comments on Revanth Reddy : రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోస్యం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్​రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్(Congress)​ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్​ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. 

Motkupalli Comments on Congress CM Candidate : కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పగ్గాలను రేవంత్​  చేపట్టిన నుంచి రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని తెలిపారు. కచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మోత్కుపల్లి(Motkupalli) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్​ అవుతున్నాయి. రేవంత్​రెడ్డి కొడంగల్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికలకు వచ్చే నెల 3న నోటిఫికేషన్​ విడుదలై.. డిసెంబర్​ 3న కౌంటింగ్​తో పూర్తి కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.