Stories On Wheels : ఇక కథలు మీ వద్దకే వచ్చేస్తాయి.. హాయిగా చదివేయండి మరి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2023, 1:33 PM IST

Mobile Library in Hyderabad : మంచి చేయాలనే మనసు ఉంటే అందుకు మార్గం కనిపిస్తుంది. సర్కారు బడిలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు గ్రంథాలయం దూరమైనా.. పుస్తకాలు దూరం కాకూడదని భావించింది హైదరాబాద్‌కు చెందిన అనన్య అనే విద్యార్థిని. సరదాగా సెలవుల్లో తన అమమ్మ వాళ్ల ఊరికి వెళ్లిన తాను.. అక్కడ చిన్నప్పుడు తన తల్లి చదువుకున్న పాఠశాలకు వెళ్లింది. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం చూసిన అనన్యకు సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అర్థమైంది.

ఇక హైదరాబాద్ వచ్చిన అనన్య సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఏదైనా చేయాలనుకుంది. అంతే తన మెదడులో స్టోరీస్ ఆన్ వీల్స్ ఆలోచన పుట్టింది. ఆలోచన రావడమే ఆలస్యం.. 'స్టోరీస్​ ఆన్ వీల్స్' అనే సంచార గ్రంథాలయాన్ని హైదరాబాద్ మాదాపూర్​లో ప్రారంభించింది అనన్య. ఈ రకంగా పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకునే అవకాశం కల్పించింది. 

తాను ప్రారంభించిన సంచార గ్రంథాలయంలో మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి ఉంచేందుకు పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి ఆదర్శంగా నిలుస్తోంది. భాగ్యనగరంలోని వేర్వేరు గేటెడ్‌ కమ్యూనిట్‌ కాలనీల్లో పర్యటిస్తూ అక్కడ వ్యాన్‌ ఉంచి దాతల నుంచి పుస్తకాలను సేకరించి వాటిన తన మొబైల్ లైబ్రరీలో అందుబాటులో ఉంచుతున్నట్లు అనన్య చెబుతోంది. ఇప్పటికే సైబర్‌ మిడొస్‌, మీనాక్షి స్కైలాంట్‌ వంటి కమ్యూనిటీస్‌లో పుస్తకాలను సేకరించినట్లు తెలిపింది. ఈ డ్రైవ్‌ ఈనెల 20 తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాతుందని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.