MLC Palla Controversy Latest : 'ఆ మాటలు నావి కావు.. నేనలా అన్లేదు'.. పక్కా ప్రూఫ్ ఉన్నా.. మాట మార్చిన పల్లా - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-08-2023/640-480-19353977-thumbnail-16x9-mlc--palla--controversy--latest.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 25, 2023, 3:15 PM IST
MLC Palla Controversy Latest : హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లిలో జనగామ ప్రాంతానికి చెందిన నాయకులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుక్కలతో పోల్చారు. అధికార పార్టీపై మొరిగే కుక్కలను పిల్లులుగా మార్చేందుకే కేసీఆర్ వారిని బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని వివాదాస్పద కామెంట్స్ చేశారు.
'ఒకసారి సీఎం సార్ను ఇదే విషయం అడిగాను. బీఆర్ఎస్లో 88 మంది ఎమ్మెల్యేలున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎందుకని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారంటే.. అటువైపు(కాంగ్రెస్లో) ఉన్నప్పుడు కుక్కల్లా మొరుగుతారని.. వారిని పార్టీలో చేర్చుకుని పిల్లుల్లాగా మార్చానని చెప్పారు.' అని ఆ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
MLC Rajeshwar Reddy Controversial Comments : ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు.. నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పల్లా ఈ వీడియోపై స్పందించారు. కొందరు.. తన మాటలను వక్రీకరించారని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పల్లా... ఎవరినీ కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.