MLC Kavitha Sings Bathukamma Song : బతుకమ్మ సంబురాల కోసం సింగర్​గా మారిన MLC కవిత.. ప్రోమో చూడండి - telangana latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 14, 2023, 3:51 PM IST

MLC Kavitha Sings Bathukamma Song : బతుకమ్మ సంబురాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో తర్వలో విడుదల కాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్​ మీడియాలో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గుడారి శ్రీనుతో కలిసి కవిత వీడియోలో కనిపించడం ఆందరిని ఆకట్టుకుంటోంది. 'తెలంగాణ జాగృతి యాప్​లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉండగా.. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. +91 8985699999 నెంబర్​కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని' కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని, తెలంగాణ జాగృతి ఆప్ ద్వారా షేర్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.