బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన మహిళలందరికి పింఛన్లు : కవిత - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2023/640-480-20118685-thumbnail-16x9-mlc-kavitha.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 26, 2023, 4:33 PM IST
MLC Kavitha Roadshow in Nizamabad : బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళకు.. సౌభాగ్య లక్ష్మి పేరిట రూ. 3000 పింఛన్ ఇస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు మద్ధతుగా.. నవీపేట గ్రామంలో ఎమ్మెల్సీ కవిత రోడ్‌షో నిర్వహించారు.
BRS Election Campaign 2023 : ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పెన్షన్‌ను సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మొదటిసారి రూ. 1016, రెండోసారి రూ. 2016కు పెంచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని.. ఈసారీ అధికారంలోకి రాగానే రూ. 3000 పింఛన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని.. పదేళ్ల రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని ప్రజలను కోరారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగొద్దంటే.. బీఆర్ఎస్ పార్టీకే మూడోసారీ ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.