MLC Kavitha Comments on the Opposition : 'బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం.. ఆ రెండు పార్టీలతో అభివృద్ధి జరగదు' - latest news in Nizamabad
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 10:41 PM IST
MLC Kavitha Comments on the Opposition : కాంగ్రెస్, బీజేపీలు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని.. ఆ రెండు పార్టీలతో అభివృద్ధి జరగదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణాలో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మురికి కూపంలో వేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు విద్యుత్‌ను పంపిణీ చేసి ఇచ్చిన మాటనిలబెట్టుకున్నారు. హైదరాబాద్‌కు ప్రముఖ పరిశ్రమలు వస్తున్నాయని ఫలితంగా వారు పన్నులు చెల్లించడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఆమె తెలిపారు. ఎన్నికలు అంటే అంత ఆషామాషీగా తీసుకొనే వ్యవహరం కాదని అమె అన్నారు.