MLA Sridhar Babu at Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద శ్రీధర్‌బాబును అడ్డుకున్న పోలీసులు.. ధర్నా అనంతరం అనుమతి - Medigadda Lakshmi Barrage
🎬 Watch Now: Feature Video


Published : Oct 22, 2023, 4:33 PM IST
|Updated : Oct 22, 2023, 5:03 PM IST
MLA Sridhar Babu at Medigadda Barrage : భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ కార్యకర్తలకి.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను నిలిపివేశారు. దీంతో బ్యారేజీ వద్ద కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపు ఆందోళనలు కొనసాగాయి. అనంతరం ఎమ్మెల్యేను సందర్శనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Argument at Medigadda Barrage : బీడువారిన పొలాలను సస్యశ్యామలం.. రాష్ట్రానికే జలప్రదాయినిగా పేరుగాంచిన ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage) వంతెన కొంతమేర కుంగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు సమాచారం.