MLA Shankar Nayak Hot Comments : 'కేసీఆర్ చావమంటే నేను చస్తా.. మీరు చస్తారా..?' - బీఆర్ఎస్ మీటింగ్ ఇన్ మహబూబాబాద్
🎬 Watch Now: Feature Video
MLA Shankar Nayak Latest Speech : తనకు ఏమైనా పని ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి పని జరిగేలా చేసుకుంటానని.. తనకు, కేసీఆర్ మధ్య మీడియేటర్లు లేరని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. తనకు కేసీఆర్ మాత్రమే బాస్ అని, తాను చావమంటే చస్తానని.. మీరు చస్తారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కన్నతల్లి వంటిదని.. అందరూ గౌరవించాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణుల మధ్య విభేదాలు వద్దని.. కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని.. దానికి కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించారు. రైతుకు ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.