MLA Redya Naik Controversy Comments In Public Meeting : 'దళితబంధు కేవలం మా అభిమానులకు మాకు ఓట్లు వేసినవారికే ఇస్తాం.. ఇదే రాజకీయ సూత్రం' - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 9:33 AM IST
MLA Redya Naik Controversial Comments In Public Meeting : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు వివాదం రాజేశాయి. 'పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా చిన్నగూడూరు మండలం మాల్యా తండా, తుమ్మలచెరువు తండా, విస్సంపల్లి, చిన్నగూడూరు గ్రామాల్లో రెడ్యానాయక్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దళితబంధు పథకాన్ని అందరికీ వర్తింపచేయాలని విస్సంపల్లిలో యువకులు నిరసనకు దిగారు. రసాభాసకు దారితీయడంతో.. పోలీసులు వారిని సముదాయించారు. అనంతరం మాట్లాడిన రెడ్యానాయక్.. తమ పార్టీ అభిమానులు, బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇది రాజకీయ సూత్రమని స్పష్టం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేయకుండా ఓడించడానికి చూసిన వారికి ఎందుకు దళితబంధు ఇస్తామని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా నిధులు వచ్చాయని ఈసారి కూడా తమ పార్టీ అభిమానులకే ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దళిత బంధు, రైతుబంధు, బీసీ, మైనార్టీ బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మీ అభిమానంతో మళ్లీ గెలవాలని సేవ చేస్తున్నామన్నారు.