MLA Rajaiah Interesting Comments on 2023 Elections : 'ఎన్నికలు వాయిదా పడొచ్చు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులకు అవకాశాలు!' - ఆసక్తికరంగా మారిన స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 6:59 PM IST
MLA Rajaiah Interesting Comments on 2023 Elections : జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని అలియాబాద్ శివారులో గతంలో సీడీఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. ఆ రోడ్డును నేడు ప్రారంభించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి అడ్డం పడ్డవాళ్లే.. మళ్లీ తామే తీసుకొస్తామని మాట్లాడటం చాలా బాధాకరమని కడియం శ్రీహరిని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. నియోజకవర్గ ప్రజలు మొక్కవోని ధైర్యంతో ఉండాలని సూచించారు.
MLA Rajaiah Criticize MLC Kadiam Srihari : రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు.. అలాగే వన్ నేషన్- వన్ ఎలక్షన్ రాబోతుందని దేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్ రాబోతుందని చెప్పారు. అప్పుడు కూడా మార్పులు, చేర్పులు జరిగేలా ఉన్నాయని అధినాయకుల దగ్గర నుంచి సమాచారం ఉందన్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని, ఆందోళనకు గురికావద్దని సూచించారు. అందరం 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నామన్న ఆయన.. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని తెలిపారు. ఎన్నికలు కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి లేదా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయని.. అప్పటి వరకు నియోజకవర్గ ప్రజలు నిబ్బరంగా, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.