MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్​ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి' - MLC Palla Rajeswerreddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 5:16 PM IST

MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మాట్లాడకుండా చేస్తున్నారన్న పల్లా రాజేశ్వర్​ రెడ్డి  వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఆయన వెనుకకు తీసుకొని.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. 

తెలంగాణ అస్థిరత్వం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించి మాట్లాడడం సరైనది కాదని.. డబ్బు మదంతో అమాయమైన నాయకులను కొనుగోలు చేయడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్​ హాల్​ నిర్వహించిన దివ్యాంగుల ఆసరా ఫించన్​ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డిపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్​కు అన్ని విషయాలు తెలుసని.. సరైన నిర్ణయం తీసుకొని అవకాశం తప్పకుండా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని కార్యకర్తలకు భరోసా కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.