కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తాం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి - మేడిగడ్డ పర్యటన
🎬 Watch Now: Feature Video
Published : Dec 29, 2023, 4:00 PM IST
Ministers Confirms Judicial Enquiry on Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని, త్వరలో ఇందులో అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈరోజు మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను మంత్రులు వీక్షించారు.
Ministers Visit Medigadda : గత ప్రభుత్వం రాజకీయ మతలబులతో ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని, కానీ రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందని మంత్రులు పేర్కొన్నారు. కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు రూ.46 వేలు ఖర్చు అవుతోందని, రైతులకు ఆదాయం సాగు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 90 శాతం ఎత్తిపోతలకే పోతోందన్నారు. ఆనకట్టల్లో నీటినిల్వ భారం ఎక్కువ కావడం వల్ల దెబ్బతిన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలపై ఊహించనంత భారం పడబోతోందన్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో రాజకీయ, ఇతర కోణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి అధికారులు అనుకూలంగా ప్రకటన ఇచ్చారని, తాము లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈఎన్సీ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు.