రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి తుమ్మల
🎬 Watch Now: Feature Video
Minister Tummala Nageswara Rao Review on Agriculture : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విత్తనాలకు సంబంధించిన వివిధ అంశాలపై సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. యాసంగి సీజన్‌లో రైతులకు పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలు లభ్యతలపై మంత్రి చర్చించారు. విత్తనాలను ముందుగా రాష్ట్ర రైతులకు సరఫరా చేయాలని, మిగిలినవే ఇతర రాష్ట్రాలకు పంపించాలని కంపెనీలకు మంత్రి సూచించారు.
Minister Tummala Nageswara Rao Meeting about Agriculture : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఒకవేళ నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతే, విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తెలిపారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల తెలిపారు.