ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్ - హుస్నాబాద్‌లో ప్రజాపాలన
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 2:18 PM IST
Minister Ponnam Prabhakar participate Praja palana Programme at Husnabad : రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల అప్పులు మిగిల్చినా, ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే గ్యారంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను 420 అంటూ విమర్శిస్తుండడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Praja palana Programme at Husnabad : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై నాలుగు రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టినా సరిపోనంత రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగిందని ప్రభాకర్ దుయ్య బట్టారు. హుస్నాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను పూర్తి చేసి, గతంలో గుర్తించిన లబ్ధిదారులకు అందించాలని ఆర్డీఓను ఆదేశించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు.