'ఎన్ని ఇబ్బందులు వచ్చినా 100 రోజుల్లోపే గ్యారంటీలు అమలు చేస్తాం' - మంత్రి పొన్నం ప్రభాకర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2024/640-480-20411745-thumbnail-16x9-praja-palana.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 2, 2024, 4:15 PM IST
Minister Ponnam Prabhakar on Praja Palana : రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. హైదరాబాద్ నాంపల్లి విజయ్‌నగర్ కాలనీలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించే కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కోసం 8.5 లక్షలు, ఇతర దరఖాస్తులు లక్ష పైగా వచ్చాయిని ఆయన తెలిపారు. అన్ని పథకాలకు కలిపి ఒకటే అప్లికేషన్ ఉందని మంత్రి వివరించారు. దరఖాస్తులను ఎక్కడుంటే అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అని గుర్తు చేశారు. గ్యారంటీలకే కాకుండా ఇతర ఏ సమస్యల కోసమైనా దరఖాస్తు చేయవచ్చని పేర్కొన్నారు.
Minister Ponnam Prabhakar Fire on Opposition Leaders : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 30 రోజులు అవ్వకుండానే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, అప్పులు చేసి వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభ్వుతం(Congress Government) లక్షల కోట్ల అప్పును ఇప్పుడు భర్తీ చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పథకాలను అమలు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఇప్పటికే అమలవుతున్న రెండు పథకాలను చూసి ప్రతిపక్షాల నాయకులు తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.