ఉచిత ప్రయాణానికి అద్భుత స్పందన - త్వరలోనే 2 వేల కొత్త బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్
🎬 Watch Now: Feature Video
Minister ponnam Prabhakar about free Bus Travel : కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటి వరకు నాలుగు కోట్లకుపైగా మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న షాపింగ్‌ల ఆదాయం పెరిగిందని అన్నారు.
Minister ponnam Prabhakar in Nizamabad Bus Stand : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల కొరత ఉందని, దానిని కేబినెట్ మీటింగ్‌లో పరిశీలించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. త్వరలోనే 2000 కొత్త బస్సులు వస్తాయని మంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదని, వాటిపై ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.