Minister KTR Comments on BJP : "రాష్ట్రంలో ఏ మూల తిరిగినా.. ప్రజల విశ్వాసం కేసీఆరే" - టీ బీజేపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 9:57 PM IST

Minister KTR Comments on BJP : తెలంగాణలో నాలుగు మూలలు తిరిగానని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని మంత్రి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో దేవరకొండకు చెందిన బిల్యా నాయక్‌ అనుచరులు బీఆర్ఎస్​లో చేరారు. గిరిజన జాతికి రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Minister KTR Fires on BJP : తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని.. అవాస్తవాలు చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తప్పుడు సర్వేల పేరుతో హడావిడి చేయడం.. కాంగ్రెస్‌కు అలవాటేనని దీని వల్ల జరిగేదేమి లేదన్నారు. కేసీఆర్​ మూడోసారి ముఖ్యమంత్రిగా.. హ్యాట్రిక్​ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ప్రకటించబోయే బీఆర్​ఎస్​ మానిఫెస్టోలో.. సబ్బండ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందించినట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.