Harish Rao Started BP Machine In Siddipet : 'హెల్దీ హార్ట్-హెల్దీ సిద్ధిపేట'... పేరుతో సెల్ఫ్ ఆటోమేటిక్ బీపీ చెకప్ మిషన్ - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2023, 4:46 PM IST
Harish Rao Started BP Machine In Siddipet : "హెల్దీ హార్ట్-హెల్దీ సిద్దిపేట" పేరిట మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే.. ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో పట్టణంలో సెల్ఫ్ ఆటోమేటిక్ బీపీ చెకప్ మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేటలో పర్యటించిన మంత్రి ఇర్కోడ్ గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ప్రారంభించారు. అనంతరం 24 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
సిద్దిపేటలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెుత్తం ఆరు చోట్ల బీపీ చెకప్ మిషన్ కేంద్రాల్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చాలా మంది ప్రజలు తాము బీపీతో బాధ పడుతున్నట్లు తెలియక సడన్ కార్డియాటిక్ స్ట్రోక్ వచ్చి ఆకస్మికంగా మృత్యువాత పడుతున్నారని, రక్తపోటు(బీపీ) పరీక్ష చేయడంతో మీ ఆరోగ్యాన్ని, మీరే పరిరక్షించుకోవచ్చని, దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. పట్టణంలోని మోడ్రన్ బస్టాండులో మంత్రి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కలిసి బీపీ చెకప్ మిషన్‌ను ప్రారంభించారు.