Minister Errabelli Dayakar Rao Warangal Tour Speech : నా రాజకీయ జీవితంలో నాకు నచ్చిన ముఖ్యమంత్రులు వాళ్లిద్దరే : ఎర్రబెల్లి - వరంగల్‌లో అభివృద్ధి పనులకు ఎర్రబెల్లి శ్రీకారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2023/640-480-19712249-thumbnail-16x9-errabelli-wgl-tr.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 8, 2023, 12:53 PM IST
Minister Errabelli Dayakar Rao Warangal Tour Speech : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులను.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మంత్రి దయాకర్‌రావు శనివారం ప్రారంభించారు. పెద్ద కొరుపోలు వట్టెవాగుపై రూ.20 కోట్లతో నిర్మించే వంతెనతో పాటు.. అలంకానిపేట నుంచి చిన్నకొరుకుల వరకు రూ.3.85 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి.. గత పాలకుల హయాంలో ఎందుకు జరగలేదో అందరూ ఆలోచించాలని ఎమ్మెల్యే కోరారు. కొత్త కొత్త పథకాలు, హామీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. నర్సంపేట వెనకపడటానికి అసలు కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. అమలు కాని హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డినే మళ్లీ ఆశీర్వదించాలని ఆయన కోరారు.