Errabelli Dayakar Rao: కార్యకర్తల కోసం గరిటె పట్టిన మంత్రి ఎర్రబెల్లి - Errabelli Dayakar Rao is cooking
🎬 Watch Now: Feature Video
Errabelli Dayakar Rao cooked in Warangal: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఆ పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమ్మేళనాల నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ శ్రేణులను కలుసుకుని పసందైన భోజనాలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని గరిట పట్టి కాసేపు వంట చేశారు. వంటకాలు రుచి చూసి సమావేశానికి వచ్చిన ప్రతి కార్యకర్త కడుపు నిండా భోజనం చేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తానే స్వయంగా అన్ని వంటకాల రుచులను చూశారు. కార్యకర్తలకు నాణ్యమైన భోజనం లభిస్తుందో లేదో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడి.. దిశానిర్దేశం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు ప్రేరణ కలిగించారు.