Minister Errabelli Crying For BRS Party worker Death : కార్యకర్త మరణవార్తతో కంటతడిపెట్టిన మంత్రి ఎర్రబెల్లి - కార్యకర్త మృతి పట్ల కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 5:50 PM IST
Minister Errabelli Crying For BRS Party worker Death : పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలోనూ.. బాధను పంచుకోవడంలోనూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరణ వార్తతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కోలా రామ్మూర్తి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి.. సన్నూరు చేరుకొని రామ్మూర్తి పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కంటనీరు పెడుతూ.. మృతునితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుని బాధను వ్యక్తపరిచారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి.. మృతుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.