ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో- బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ - ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 8:02 PM IST
Minister Amit Shah Road Show in Hyderabad : ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందురు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah) హైదరాబాద్ ఉప్పల్‌లో రోడ్ షో నిర్వహించారు. ముందుగా జనగామ, మెట్‌పల్లిలో సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న అమిత్ షా.. అనంతరం ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ(BJP) అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు మద్దతుగా అమిత్ షా ప్రచారం చేశారు.
Amit Shah Road Show in Uppal : రోడ్ షో(Road Show)లో అమిత్ షా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందులో బీజేపీ శ్రేణులు, ప్రజలు అమిత్ షాను చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నృత్యాలు చేస్తూ.. సందడిగా కొనసాగించారు. ఆయా ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ రోడ్ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీని గెలిపిస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని.. డబుల్ సర్కార్ వల్ల లాభాలను అమిత్ షా ఓటర్లకు వివరించారు.