ఆళ్లగడ్డలో మంచు మనోజ్ మౌనిక దంపతుల సందడి.. శోభా ఘాట్ వద్ద నివాళులు - Manchu Manoj mounika
🎬 Watch Now: Feature Video
Manchu Manoj Nagamounika couple reached Allagadda : మంచు మనోజ్, భూమా నాగమౌనిక దంపతులు ఆళ్లగడ్డ చేరుకున్నారు. నాగ మౌనిక తల్లిదండ్రుల సమాధులు ఉన్న శోభా ఘాట్ వద్ద.. వారికి నివాళులు అర్పించారు. వారి వెంట నాగ మౌనిక కుటుంబ సభ్యులు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఉన్నారు. కొత్త దంపతులను చూసేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పెద్ద ఎత్తున భూమా అభిమానులు తరలివచ్చారు. మంచు మనోజ్ తో చాలామంది కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలకు మంచు మనోజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విందు ఏర్పాటు చేసిన అఖిల ప్రియ.. నవదంపతులు తొలిసారిగా భూమా నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులతో గడిపారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అతిథులకు విందు ఏర్పాటు చేశారు. అంతకు ముందు హీరో మంచు మనోజ్ కుమార్ దంపతులు కర్నూలు పట్టణంలో సందడి చేశారు. వివాహమైన సందర్భంగా మౌనికారెడ్డి తాత మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసేందుకు ఇక్కడకు చేరుకున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం కర్నూలు నుంచి ఆళ్లగడ్డకు ప్రయాణమయ్యారు.