ganja cultivation in Hyderabad : ఏం తెలివి బాసూ.. ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు - ganja cultivation at home in Hyderabad
🎬 Watch Now: Feature Video
ganja cultivation at home in Hyderabad : హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ఆవరణలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్‌లో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గంజాయి మొక్కలు పెంచుతున్న సాయి రేవంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ గోదావరికి చెందిన సాయి రేవంత్ గత రెండేళ్లుగా వనస్థలిపురంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గంజాయికి అలవాటు పడిన రేవంత్ ఇంటి ఆవరణలోనే గంజాయి సాగు చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఇంటి ఆవరణలో కూరగాయలు, వివిధ రకాల పూల మొక్కలతో పాటు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు వెల్లడించారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడి నుంచి10 గంజాయి మొక్కలు, 3 గంజాయి విత్తన ప్యాకెట్లు, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.