Man drowned at Hayatnagar : బావిలో ఈతకు దిగి వ్యక్తి మృతి.. మొబైల్లో రికార్డయిన దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
Man drowned while swimming at Hayatnagar : సమ్మర్ కదా అలా సరదాగా వెళ్లి స్విమ్మింగ్ చేస్తే చల్లగా ఉంటుందని వెళ్లాడు. స్నేహితులతో కలిసి ఆనందంగా స్మిమ్మింగ్ చేస్తున్నాడు. కొందరు యువకులు బావిలో ఈత కొడుతుండగా.. వారి స్నేహితుల్లో కొందరు బయట ఉండి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. అంతా సరదాగా సాగుతున్న సమయంలో అకస్మాతుగా ఓ వ్యక్తి నీటిలో మునిగాడు. ఏదో ప్రాంక్ చేస్తున్నాడులే అని ఫ్రెండ్స్ పట్టించుకోలేదు. కానీ.. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి కోసం వెతికారు. ఎంత వెతికినా కనిపించకపోయే సరికి గల్లంతయ్యాడని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో బావిలో ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌కు చెందిన అబ్దుల్ రజాక్ కొందరు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. కొద్దిసేపటి వరకు సరదాగా ఈత కొడుతున్నాడు. కొందరు స్నేహితులు బయట ఉండి ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులు చూస్తుండగానే ఈత కొడుతూనే ఉన్నపాటుగా రజాక్ మునిగిపోయాడు. స్నేహితులందరూ అతను స్టంట్ చేస్తున్నాడేమో అనుకున్నారు. బయటకు వస్తాడులే అని ఎదురుచూస్తున్నారు. ఎంత సేపటికి రజాక్ బయటకు రాలేదు.
కాసేపటి తర్వాత స్నేహితులు రజాక్ కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో రజాక్ నీటిలో మునిగిపోయాడని స్నేహితులు నిర్దరణకు వచ్చారు. ఈ ఘటన అంతా చరవాణీలో రికార్డయ్యాయి. స్నేహితుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. రజాక్ కోసం నిన్నటి నుంచి గాలించగా.. ఇవాళ మధ్యాహ్నం మృతదేహం లభ్యం అయింది. అయితే రజాక్ ఈత కొడుతూ మునిగిపోతున్న దృశ్యాలు మొబైల్ ఫోన్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజాక్ మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.