Mahesh kumar Goud on Dharani Portal : తెలంగాణలో ధరణి వల్ల పేదలకు తీవ్ర అన్యాయం... - ధరణిపై మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Mahesh kumar Goud comments on Dharani Portal : తెలంగాణలో ధరణి వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ధరణిలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ బంధువులు, భూ స్వాములు, జమీందారులు.. గ్రామాల్లోకి తిరిగి వచ్చి.. పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ధరణి వల్ల భూ బకాసురులు కొందరు పేదల భూములను ఆక్రమించుకుని మోసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ధరణిపై కంట్రోల్ రూమ్ పెడితే వేలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారన్నారు. కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలుగా మహబూబ్ నగర్ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తేమెరుగైన రెవెన్యూ విధానాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు.