సన్‌బర్న్ ఈవెంట్ వివాదం - బుక్ మై షో ఎండీ, నోడల్ అధికారికి నోటీసులు : మాదాపూర్ అదనపు డీసీపీ - న్యూ ఇయర్ ఈవెంట్స్ పరిమిషన్స్
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 5:55 PM IST
Madhapur DCP on Sunburn Event Permission : నూతన సంవత్సర వేడుకలకు సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేదని మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. అనుమతులు తీసుకోకుండా సన్‌బర్న్ ఈవెంట్‌కు బుక్‌మై షోలో టికెట్లు విక్రయిస్తున్న సుమంత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుక్ మై షో ఎండీ(Case on Book My Show) సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
New Year Events Permissions Explain Madhapur DCP : నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారికి నియమ నిబంధనలు జారీ చేసినట్లు అదనపు డీసీపీ వివరించారు. సన్‌బర్న్ పేరును వాడుకుని నిర్వహిస్తున్నారే తప్ప అది సన్‌బర్న్ ప్రధాన వేడుక కాదని వెల్లడించారు. ఈవెంట్ కోసం తమకు దరఖాస్తు చేశారని ఎక్సైజ్ సహా ఇతర అనుమతులు తీసుకోనందున అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. ఈవెంట్లు నిర్వహించే పబ్బులకు, నిర్వాహకులకు డ్రగ్స్ అక్కడకు రాకుండా చూసుకునే బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు.