Lovers Kissing Viral Video : ఇదేందయ్యా ఇదీ.. వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వీడియో వైరల్ - లవర్స్ ముద్దుల వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2023, 1:44 PM IST
Lovers Kissing Viral Video : ఈ మధ్య కాలంలో ప్రేమ జంటలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. రోడ్లపై తిరుగుతున్నామనే విషయాన్ని కూడా మరచిపోయి.. అసభ్యకరమైన రీతిలో చేష్టలు చేస్తున్నారు. గతంలో బైక్‌పై వెళుతూ ముద్దులతో రెచ్చిపోయిన పలు ప్రేమ జంటలను చూశాం. కానీ ఈ లవర్స్ మాత్రం అందుకు భిన్నంగా వారి కన్నా తాము తక్కువా అన్నట్లు ఏకంగా కారుపైనే కూర్చోని ముద్దులతో రెచ్చిపోయారు. ఈ ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్ వంతెనపై శనివారం అర్ధరాత్రి ప్రేమ జంట వికృత చేష్టలకు పాల్పడింది. ఏకంగా వేగంగా వెళుతున్న కారు టాప్‌పై కూర్చోని ముద్దుల్లో మునిగిపోయారు. ప్రేమికుల జంట చేస్తున్న వికృత చేష్టలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంకేముంది.. వీడియో చూసిన నెటిజన్లు వారి తీరుపై మండిపడుతున్నారు. ఈ ముద్దుల వీడియో.. చివరకు పోలీసులకు చేరడంతో వారు ప్రేమ జంటను తీవ్రంగా హెచ్చరించారు.