కారును ఢీకొట్టి టోల్‌ప్లాజా క్యాబిన్లోకి దూసుకెళ్లిన లారీ - ఇందల్వాయి టోల్‌ప్లాజా యాక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 6:56 PM IST
|Updated : Dec 26, 2023, 7:46 PM IST
Lorry Hit a car at Nizamabad Toll Plaza : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి 44వ జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో వచ్చి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం లారీ టోల్‌ప్లాజా క్యాబిన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా టోల్‌ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కూడా గాయపడ్డారు. దీంతో అక్కడున్న స్థానికులు లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు.
Nizamabad Toll Plaza Accident : కారులోని గాయపడిన ప్రయాణికులను, టోల్‌ప్లాజా సిబ్బందిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టోల్‌ప్లాజాకు సంబంధించిన క్రేన్(Toll Plaza Crane) సాయంతో లారీని ఘటన స్థలం నుంచి పక్కకు తొలగించారు. డిచ్పల్లి సీఐ కృష్ణ వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని లారీ డ్రైవర్‌ను ఆదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.