ప్రమాదవశాత్తు బావిలో పడిన చిరుత, గ్రామస్థుల సాయంతో కాపాడిన అధికారులు - బావిలో పడిన చిరుత వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 10:53 AM IST
Leopard Fell Into Well Viral Video : ప్రమాదవశాత్తు బావిలో పడిన చిరుతను గ్రామస్థుల సాయంతో అటవీశాఖ అధికారులు రక్షించారు. ఈ సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది. జిల్లాలోని మూడబిద్రె గ్రామంలో సోమవారం ఉదయం చిరుత అనుకోకుండా బావిలో పడింది. చిరుతను చూసిన గ్రామస్థులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారి సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో మండల అటవీ అధికారి హేమగిరి బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చిరుతను పైకి తీసుకురావటానికి కర్రల సాయంతో నిచ్చెనను ఏర్పాటు చేసి బావిలో పెట్టారు. అలానే పైకి రాగానే చిరుత పారిపోకుండా ఉండేందుకు ఒక వలను ఏర్పాటు చేశారు. జిల్లాలో కురిసిన వానల కారణంగా బావిలో నీటిమట్టం ఎక్కువగా ఉంది. దీంతో చిరుత నీటిలో నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించి అలసిపోయింది. ఎట్టకేలకు బయటకు వచ్చిన చిరుతను బోనులో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులు చిరుతకు ప్రథమ చిక్సిత చేశారు.