'కేవలం ప్లైఓవర్ల నిర్మాణాలే అభివృద్ధి పనులుగా అధికార పార్టీ చూపిస్తోంది' - telangana assembly elections 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 7:21 PM IST
LB Nagar BJP Candidate Sama Ranga Reddy Election Campaign : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వివిధ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలకు ఎన్నికల హామీలను వివరిస్తూ.. తమ పార్టీకే ఓటు వేయాలని అగ్ర నాయకులు సైతం కోరుతున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మన్సూరాబాద్ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉండగా.. ప్లైఓవర్ల నిర్మాణాలే అభివృద్ధి పనులుగా అధికార పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాత్రి వేళ కొందరు మీటింగ్లు పెట్టి మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.