దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే : కేటీఆర్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 12:44 PM IST

KTR visits Guvvala Balaraju in Hospital : అర్ధరాత్రి నాగర్​ కర్నూల్​ జిల్లాలో కాంగ్రెస్​ కార్యకర్తల దాడిలో గాయాలపాలైన బీఆర్​ఎస్​ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్(KTR)​ పరామర్శించారు. హైదరాబాద్​లోని ఆస్పత్రిలో ఉన్న బాలరాజును కలిసి దాడి జరిగేందుకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వమేనని.. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని హెచ్చరించారు. ఇంతకింత అనుభవించాల్సి వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని పేర్కొన్నారు. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరారు. 

Congress BRS Leaders Conflict in Nagarkurnool : అచ్చంపేటలోని ఓ కారును కాంగ్రెస్​(Congress) పార్టీ కార్యకర్తలు అడ్డుకుని.. స్థానిక బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో కారుపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్​ఎస్​ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్ధులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్పగాయాలైయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తరవాత.. హైదరాబాద్​లోని​ ఆస్పత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.