మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి : మంత్రి కేటీఆర్
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 6:25 PM IST
KTR Reaction on Congress BC Declaration : కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్.. బీజేపీ స్ఫూర్తితో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ఇలా చాలా సార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని(KTR Comments on Congress) విమర్శించారు.
KTR Comments on BJP : కాంగ్రెస్ బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. 2004- 2014 మధ్య కాంగ్రెస్ మైనారిటీలకు ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ మైనారిటీల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్ డిక్లరేషన్ చెబుతోందని.. ఇది ఒక కుట్ర అని ధ్వజమొత్తారు. ఈ డిక్లరేషన్ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్రెడ్డి ఇద్దరూ ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా రాదని చెప్పారు.