KTR in Thanksgiving Meeting of Disabled People : తెలంగాణలోనే అధిక పింఛన్లు.. దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్ - దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2023, 3:01 PM IST
KTR in Thanksgiving Meeting of Disabled People : దివ్యాంగుల కోసం గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను 3 నుంచి 4 శాతానికి పెంచామన్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే దివ్యాంగులకు రూ.6,016 పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
KTR Fires on Congress : కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో దివ్యాంగులకు రూ.200, కర్ణాటకలో రూ.1,100 మాత్రమే పింఛన్ ఇస్తున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4 వేలు పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణలో ఇస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో పింఛన్ రూ.600 నుంచి రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. నేడు ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్‌కు.. గతంలో 11 సార్లు అవకాశం ఇచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో.. ఫ్లోరోసిస్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షన్నర మందికి అంగవైకల్యం వచ్చినట్లు విమర్శించారు.