మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ - ఆ ఫైల్స్‌పై తొలి సంతకం
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 3:36 PM IST
Konda Surekha Charge as a Telangana Forest Minister : వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచారు. పరిహారం పెంపుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ(Minister Konda Surekha) సచివాలయంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతిని ఇస్తూ మరో ఫైల్‌పై కూడా మంత్రి సంతకం చేశారు.
Konda Surekha First Sign of Ex gratia : హరితహారం ద్వారా ఇప్పటి వరకు జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా పథకం ద్వారా చేపట్టిన పనులను, నిధుల వివరాలను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అధికారులు తెలిపారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.