Komatireddy Rajgopal Reddy Clarity on Contesting in Assembly Election : 'బీజేపీ తరపున మునుగోడు నుంచే పోటీ చేస్తా' - మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 10:38 PM IST

Komatireddy Rajgopal Reddy Clarity on Contesting in Assembly Election : రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా.. మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ​రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల కోసం, అధికారం కోసం కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లు అబద్ధపు హామీలిస్తున్నాయని విమర్శించారు. 

Komatireddy Rajgopal Reddy Fires on Congress : బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ రెండూ ఒకే పార్టీ అనీ.. కేసీఆర్​, రేవంత్​రెడ్డిని ప్రజలు నమ్మబోరని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో.. కేసీఆర్​ రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. అబద్ధపు హామీలను బీజేపీ ఇవ్వదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్​ కౌరవ సైన్యంపై  నైతిక విజయం సాధించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.