Komati Reddy Rajagopal Reddy Comments on CM KCR : '100 మంది కేసీఆర్​లు వచ్చినా.. ఈసారి కాంగ్రెస్​ విజయాన్ని ఆపలేరు' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 9:34 PM IST

Komati Reddy Rajagopal Reddy Comments on CM KCR : వంద మంది కేసీఆర్​లు అడ్డొచ్చినా.. తెలంగాణలో కాంగ్రెస్​ విజయాన్ని ఆపలేరని మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కచ్చితంగా రాష్ట్రంలో 80 సీట్లను కాంగ్రెస్​ పార్టీ గెలిచి.. అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై కేసీఆర్​ కుటుంబ పాలనను ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్​ చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డికి శంషాబాద్​ విమాశ్రయంలో కాంగ్రెస్​ శ్రేణులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

తెలంగాణలో 80 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. 'రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్​ గాలి జోరుగా వీస్తోంది. ఆనాడు కేసీఆర్​ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీ వైపు అడుగులు వేశాను. కానీ ప్రజల్లో బీజేపీ తన బలాన్ని కోల్పోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి' అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.