ఉద్యోగులంతా సమర్ధంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు : కోదండరాం - Prof Kodandaram on TNGO
🎬 Watch Now: Feature Video


Published : Jan 10, 2024, 7:19 PM IST
Kodandaram launches TNGOS Hyderabad Sports Meet : ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడంలో అధికారుల, ఉద్యోగుల పాత్ర కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పునరుద్ఘాటించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఎన్జీవోఎస్(TNGOS) తొమ్మిదో హైద్రాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్‌ను టీఎన్జీవోఎస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌తో కలిసి ఆచార్య కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడారు.
TNGOS Hyderabad Sports Meet at LB Stadium : ఉద్యోగులు సమర్థంగా పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయని, తద్వారా సర్కారుకు మంచిపేరు వస్తుందని కోదండరాం అన్నారు. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కోదండరామ్ పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో టీఎన్జీవోఎస్ హైదరాబాద్ జిల్లా స్పోర్ట్ మీట్‌ను గత తొమ్మిదేళ్లుగా జరుపుతున్నారని ఆ సంఘం అభ్యర్థులను అభినందించారు.