ఎన్నికలు సజావుగా జరగాలని ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి - భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేసిన కిషన్ రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 4:35 PM IST

Kishan Reddy puja at Charminar Bhagyalakshmi Temple  : నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడిన అగ్రనేతలు ఇప్పుడు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఓటర్ల మనసేంటో అర్థంగాక గందరగోళంతో తమకు విజయాన్ని ప్రసాదించాలని దేవుళ్లకు ప్రార్తనలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు పార్టీల కీలక నేతలు ఆలయాల సందర్శనలో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి వరకు సభలు,సమావేశాలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు పలు యత్నాలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక భగవంతుడిపై భారం వేశారు. తమపార్టీని గెలిపించాలని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. 

దీంట్లో భాగంగా రేపు పోలింగ్ తేదీ రావటంతో చార్మినార్‌లో భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ నాగలక్ష్మీ ఆలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 41 మంది కార్మికులు సొరంగం నుంచి అమ్మవారి ఆశీస్సులతో సురక్షితంగా బయటపడ్డారని.. కిషన్‌రెడ్డి తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు.

Revanth Reddy Puja At Birla Mandir Temple : హైదరాబాద్ నాంపల్లి దర్గాను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, వీ.హనుమంత్ రావు, వి.హనుమంతరావు, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బిర్లా టెంపుల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.