రాబోయే సంవత్సరం కీలక ఘట్టాలకు వేదిక కాబోతోంది- కిషన్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Dec 31, 2023, 3:41 PM IST
Kishan Reddy Parliament Elections 2024 : రాబోయే 2024వ సంవత్సరం భారతదేశానికి కీలకమైన, చరిత్రలో నిలిచిపోయే సంవత్సరమని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Kishan Reddy on Upcoming 2024 Year : సికింద్రాబాద్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ మన్ కీ బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. భారత దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని, దేశ ప్రతిష్టను పెంచే విధంగా అనేక కార్యక్రమాలను ప్రధాన మోదీ చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ మరోవైపు పేద ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేసి పేదరికరం రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి వర్చువల్‌గా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు.