Sarpanch became a Sanitation Worker : చెత్తట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన గ్రామ సర్పంచ్ - Khammam District News
🎬 Watch Now: Feature Video
Peddamunagala village sarpanch : గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. గ్రామానికి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించడం తన బాధ్యత.. ఇతరులతో కలిసి పరిష్కరించడం వీలు కానీ సందర్భంలో.. కొన్నిసార్లు తనే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి పెద్దమునగాల గ్రామ సర్పంచ్‌కు వచ్చింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించడంతో గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతోంది. పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. చెత్త ట్రాక్టర్లు రాక.. చెత్తను సేకరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్ద మునగాలలో సర్పంచ్ పరికపల్లి శ్రీను.. స్వయంగా తానే చెత్త సేకరణ పనులు చేపట్టారు. పంచాయతీ ట్రాక్టర్‌ను ఇంటింటికి తీసుకెళ్లి ఇళ్లలో చెత్త సేకరించి స్ఫూర్తిగా నిలిచారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా, పంచాయతీ కార్మికుడిగా అవతారం ఎత్తి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ శ్రీను.. ప్రభుత్వాన్ని కోరారు. చాలీచాలని వేతనంతో ఏళ్లుగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని.. వారి న్యాయపరమైన కోరికలు అమలు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.