Khammam Accident Live Video : అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టిన కారు.. దంపతులు దుర్మరణం.. ఒళ్లు గగుర్పొడిచేలా ప్రమాద దృశ్యాలు - funeral attended couple died khammam accident
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 1:56 PM IST
Khammam Accident Live Video : బంధువులు చనిపోయారని చివరి చూపుకోసం వెళ్లిన దంపతులు దుర్మరణం చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రమాదం జరిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం వెంకట్రమాపురం శివారు ఎస్‌ఎం పేటకు చెందిన మదనపల్లి సంతోశ్ కుమార్ ఈ నెల 27వ తేదీన కుటుంబంతో కలిసి తన పెద్దనాన్న అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత శుక్రవారం రోజున సాయంత్రం తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపైకి రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోశ్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న అతడి భార్యతో పాటు వారి పిల్లలు యోజిత, గగన, వారి సోదరుడి పిల్లలు హేమలతశ్రీ, కోమర్ రావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంతోష్ భార్య మృతి చెందింది. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
TAGGED:
khammam road accident