Kavitha Attended PV Narismha Rao Statue Unveiling : 'పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం ఇవ్వలేదు' - PV statue unveiling in Nizamabad
🎬 Watch Now: Feature Video
Kavitha Attended PV Narismha Rao Statue Unveiling : నిజామాబాద్‌లోని బోర్గాం చౌరస్తాలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పీవీ కూతురు సురభి వాణిదేవీ పాల్గొన్ని.. విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన సంస్కరణలతో దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన పీవీకి.. కాంగ్రెస్ పార్టీ (MLC Kavita fires on Congress) సముచిత గౌరవం ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయన ఆలోచనా విధానాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యతో పాటు ఐటీ రంగంలో కొత్త ఒరవడికి.. పీవీ నరసింహారావు ఆనాడు శ్రీకారం చుట్టారని కవిత గుర్తు చేశారు. వాటి ఫలితాలు నేడు అందుతున్నాయని వివరించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి వైపు నడిపిన మేధావి పీవీ అని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేశాలా ప్రణాళికలు చేపడుతామని కవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.