Water Release from Saraswathi Pumphouse : సరస్వతి పంపుహౌస్ నుంచి కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు షురూ - కాళేశ్వరం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Kaleshwaram Water Release from Saraswathi Pumphouse : వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్‌లో 4 మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. రెండు రోజుల క్రితం రెండు మోటార్ల ద్వారా ప్రారంభమైన నీటి ఎత్తిపోత.. జల ప్రవాహం పెరగడంతో క్రమంగా నాలుగు మోటార్లకు చేరుకుంది. ప్రస్తుతం 4 మోటార్లు రన్ చేస్తూ... 8 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.71 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉంది. బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 130.00 మీటర్లు ఉండగా ప్రస్తుతం 126.99 మీటర్ల మేర నీరు ఉంది. ఈ క్రమంలో సరస్వతి పంపుహౌస్ నుంచి 4 మోటార్ల ద్వారా 11,724 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.