KA Paul on Telangana Elections 2023 : 'తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం' - తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 2:52 PM IST

KA Paul on Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. 

KA Paul At Nizamabad : ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ(Praja Shanthi Party) తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ 79 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో అగ్రకులాల పాలన ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందని ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో అత్యవసర వైద్యం సాయం కోసం హెలికాప్టర్​ను ఏర్పాటు చేస్తానని.. అదే విధంగా ప్రతి మండలంలో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.