KA Paul Comments on BRS Manifesto : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టో అంతా బూటకం.. తెలివైనవాడు బీఆర్​ఎస్​కు​ ఓటెయ్యడు' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 7:03 PM IST

KA Paul Comments on BRS Manifesto : బీఆర్​ఎస్​ మేనిఫెస్టో అంతా బూటకమని.. కేసీఆర్​ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలను చేస్తున్నారని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​(KA Paul) ఆరోపించారు. తెలివైనవాడు ఎవడూ.. కేసీఆర్​కు ఓటెయ్యడన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీ పాలనను వెలివేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలపై విమర్శలు గుప్పించారు.

KA Paul Fires on KCR : కేసీఆర్​ సర్కార్..​ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుయబట్టారు. గత ఎన్నికలప్పుడు​.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కరాని మండిపడ్డారు. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు, నిరుద్యోగులకు ఉద్యోగాల హామీని నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ కూడా ఆచరణ సాధ్యం కానీ.. హామీలను ఇచ్చి చేతులెత్తేసిందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ మతతత్వపార్టీ అని ఆరోపించారు. బడుగ వర్గాల వారికే ప్రజాశాంతి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని.. బలహీన వర్గాల వారికి ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.