Jupally Krishna Rao Serious on Police : 'ప్రగతిభవన్‌ ఆదేశాలకు అనుగుణంగానే.. రాష్ట్రంలో పోలీస్‌ యంత్రాంగం నడుచుకుంటోంది' - నాగర్ కర్నూల్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 7:01 PM IST

Jupally Krishna Rao Serious on Police : ప్రగతిభవన్‌ ఆదేశాలకు అనుగుణంగానే.. రాష్ట్రంలో పోలీస్‌ యంత్రాంగం నడుచుకుంటోందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పోలీస్ రాజ్యం సాగుతోందని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి ఆయన అనుచరులతో కలిసి వచ్చి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్​ను కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పోలీసుల తీరుపై పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను విచక్షణారహితంగా చితకబాదుతున్నారని.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Jupally Fires on BRS : పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు జూపల్లి వివరించారు. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా మారి డబ్బు సంచులు, మద్యం బాటిళ్లను రహస్య ప్రాంతాలకు చేరవేసేందుకు సమాయత్తమవుతున్నారని జూపల్లి ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలు బూటకమని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు పరిచి పేదలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.