'ఈ నెల 5న జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం - ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్ ప్రదానం' - జేఎన్టీయూహెచ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 7:01 PM IST
|Updated : Jan 3, 2024, 7:07 PM IST
JNTUH Convocation Ceremony 2024 : జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహ రెడ్డి తెలిపారు. ఈరోజు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్‌కు (ISRO Chairman Dr. Somanath) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని తెలిపారు. అలాగే వివిధ విభాగాలలో విద్యను పూర్తి చేసుకున్న 88,226 విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు ప్రకటించారు.
JNTUH Graduation Ceremony 2024 : ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) హాజరై డిగ్రీ పట్టాలతో పాటు విద్యా సంవత్సరంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 54 బంగారు పతకాలు అందజేస్తారని తెలిపారు. యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన జాబ్ మేళాలు, వివిధ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఎంవోయూ(MOU)లు, ప్రవేశపెట్టిన నూతన కోర్సుల వివరాలను ఆయన వెల్లడించారు.