jewelery exhibition in hyderabad: ఆభరణ ప్రదర్శనలో మెరిసిన సినీ తారలు - latest jewelry exhibitions in telangana
🎬 Watch Now: Feature Video
jewelery exhibition in hyderabad: ఆధునిక, సంప్రదాయ డిజైన్ల మేళవింపుగా హైలైఫ్ బంగారు అభరణాల ప్రదర్శన నగరంలో ఏర్పాటైంది. సరికొత్త డిజైన్ అభరణాలను పరిచయం చేస్తూ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను సినీ కథానాయికలు నిత్య నరేశ్, శ్రీలేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు నిత్య నరేశ్, శ్రీలేఖ, హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ డొమినిక్తో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న రకాలైన అభరణాలను ప్రదర్శిస్తూ అమ్మాయిలు సందడి చేశారు. డైమండ్ పొదిగిన అభరణాలను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడతానని నిత్య నరేశ్ అన్నారు. అభరణాలను ఇష్టపడని మగువలు ఉండరన్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పిన నిత్య.. మంచి కథా చిత్రాల్లో నటించాలన్నదే తన అభిలాష అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 200కి పైగా ప్రముఖ జ్యూయలరీ డిజైనర్లు, వ్యాపార సంస్థలు ఇందులో పాల్గొన్నట్లు హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ డొమినిక్ తెలిపారు. మూడ్రోజుల పాటు ఈ ప్రదర్శన నగరవాసులకు అందుబాటులో ఉంటుందని వివరించారు.